మురికిని దూరం తరమండి.

మురికిని దూరం తరమండి.

మురికిని దూరం తరమండి.
ఆరోగ్యంగా ఉండండి.  

మురికితో పాటు దోమలు ఉంటే,
దోమలు కుడితే,  జ్వరమే వస్తే,
ఇంట్లో వాళ్ళకు జబ్బులు వస్తే,
ఇక మందుల ఖర్చులు బోలెడు.

మురికిని దూరం తరమండి.
ఆరోగ్యంగా ఉండండి.

పనులన్నీ మరి పాడైపోతే,
మంచంపై ఇక విశ్రాంతే,
అమ్మకు నాన్నకు ఇబ్బందే,
బడిలో మరి ఇక వెనుకంజే.

మురికిని దూరం తరమండి.
ఆరోగ్యంగా ఉండండి.

మురికిని దూరం చేసేయండి.
దోమల మందు కొట్టేయండి.
తలుపు, కిటికీ తెరిచేయండి.
ఆరోగ్యంగా ఇక ఆటాడం‍డి.

అందుకే...
మురికిని  దూరం తరమండి.
ఆరోగ్యంగా ఉండండి.

Comments

Popular posts from this blog

టీచర్

మా 'సారు'

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)