Posts

Showing posts from 2021

మా 'సారు'

పాఠం చెప్పిన తర్వాత ... నాకేమొచ్చేదో తెలియదు. కానీ మా సారుకు తెలిసేది. అమ్మకు...  బిడ్డ ఆకలి తెలిసినట్టు. చదవడం రాదన్నా సారు చదువుమనేది. అదేం చిత్రమో...  తప్పులే లేకపోయేవి. ఓపిక... మా సారు పేరే పెట్టుకుంది. అది మా సారు నుండే ఓపికగా ఉండటం నేర్చుకున్నది. నామీద  నాకు అపనమ్మకం. కానీ మా సారుకు  నాకృషి మీద నమ్మకం. భవిష్యత్తులో ఏం చేయాలో  ఆలోచన లేని నాపై ... మా సారుకు ఎంతో గురి. అందుకే ... సున్నా వచ్చినా పర్లేదు,  ప్రయత్నం చేయమనేది.  కానీ ఆయన నమ్మకం... ఎప్పుడూ యాబైకి తగ్గేది కాదు. అవును... నాకంటే మా సారుకే  నేనంటే నమ్మకం.

పర్యావ'రణం'

🌻"తాను" ఏకాకి🌻 "తన"కు "తాను" అపరిచితుడు. 'తన'ను "తాను" ఎరుగడు. 'తన'లోనే "తాను" ఉన్నానని  తెలియని అద్వైతం - మాయ. 'తన' నుండి "తాను" వేరనే  ద్వైతంలోని మాయ. పంచభూత తత్త్వం ' "తానే" ' నని ఎరుగని వాడు చేసే ప్రతి క్రియా "తన"కు ప్రతిక్రియగా మారుతుందని తెలుసుకునే నాటికి, 'తన' నుండి "తన"ను బయటకు తరిమేస్తున్నదనే చైతన్యం శూన్యమై, శాశ్వతంగా ద్వైతం కిందకు  మారిపోతున్నది. మారడాన్ని వ్యతిరేకించే జడత్వం "తన" చేతనను నిర్వీర్యం చేస్తుందని తెలుసుకునే సమయానికి, 'ప్రకృతి' "మనిషి"ని తనలో కలవకుండా ఏకాకిగా వదిలివేస్తుంది. ప్రకృతి పట్ల చైతన్యమే మనిషికి 'తన్'మయత్వం.             *****