Posts

Showing posts from 2019

టీచర్

ఈ రోజు పంద్రాగస్టు. ఉదయం బడికి పోయి జెండా ఎగరేసి వచ్చి భోజనం చేస్తున్నాం. భోజనం మధ్యలో ఫోన్. మావాడి గురించి వాళ్ళ టీచర్ ఫోన్. తను ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగా పోయిన బడిలో కాంపిటీషన్ కు పిల్లల్ని తయారు చేయడానికి నాలుగు శ్లోకాలు చదివి రికార్డు చేసి పంపమని. చర్చ వాడి‌ స్కూల్ పిల్లలు చదువుల పైకి మళ్ళింది. ట్రాన్స్ఫర్ అయిన సార్లు, పోయిన తరగతుల్లో చెప్పిన టీచర్లు ... అన్ని ఒకదానివెంట ఒకటి కబుర్లు నడుస్తూ ఉన్నాయి. నచ్చిన టీచర్ గురించి మొదలు. తనను మెచ్చుకుంటూ ... తోటి విద్యార్థులు ఆ టీచర్ ను మాత్రం నిక్ నేమ్ తో పిలవలేదు. మిగతా టీచర్లు సార్లను నిక్ నేమ్ లతో పిలిచేవారు అన్నాడు. ఆ టీచర్ పై మాత్రం అభిమానం తో ఏమీ అనేవారు కాదని అన్నాడు. కారణం అడిగితే ఆ టీచర్ అలా విద్యార్థులను చూసుకునేది అన్నాడు. ఇంతలోనే ఒకేసారి... తను మాత్రం టీచర్ కావద్దని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. పిల్లలు టీచర్స్ ను అలా అమర్యాదగా పిలుస్తారు కాబట్టి అన్నాడు. అట్లా ఎందుకు? మా చిన్నప్పుడు కూడా మా‌ టీచర్ సార్ లను అలాగే పిలిచేవారు. మరి నేను టీచర్ అవుదామనుకున్నపుడు కాని, ట్రైనింగ్ కు పోయినపుడు ఇలా అనిపించలేదు కదా అన్న

మురికిని దూరం తరమండి.

మురికిని దూరం తరమండి. మురికిని దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి.   మురికితో పాటు దోమలు ఉంటే, దోమలు కుడితే,  జ్వరమే వస్తే, ఇంట్లో వాళ్ళకు జబ్బులు వస్తే, ఇక మందుల ఖర్చులు బోలెడు. మురికిని దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి. పనులన్నీ మరి పాడైపోతే, మంచంపై ఇక విశ్రాంతే, అమ్మకు నాన్నకు ఇబ్బందే, బడిలో మరి ఇక వెనుకంజే. మురికిని దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి. మురికిని దూరం చేసేయండి. దోమల మందు కొట్టేయండి. తలుపు, కిటికీ తెరిచేయండి. ఆరోగ్యంగా ఇక ఆటాడం‍డి. అందుకే... మురికిని  దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి.