Posts

Showing posts from 2018

మహాదాత

నాలుగు మెతుకులు తిని ఆరుగాలాలు శ్రమించి వేలమంది ఆకలి తీర్చే ఓ రైతన్నా నిజం నిజం ముమ్మాటికీ నువ్వు అన్నదాతవే! మాకోసం నీ వద్ద లేని భూమిని నీటిని  ఎరువును విత్తనాన్ని ఒక్కటి చేసి మెతుకు గా మార్చి బతుకు మాకిస్తున్నావు. నీకంటూ ఏమీ మిగలనీయని మా మానవతను ఏవగించుకో... శపించకు నాగరికత ముసుగులో శలభాలం నీ కడుపు మంటకు మాడిపోతాం. ఆకలిమంటలకు మసయిపోతాం. కానీ... నీవు దాతవు నీకంటూ దాచుకోవు. మేము మాత్రం ఏం చేస్తాం! ప్రపంచీకరణ ఊబిలో కూరుకు పోతున్న వినియోగదారులం. దారీతెన్నూ లేని బాటసారులం. కంటనీరు ఉబుకని రాతిగుండెలం. జీ హుజూరనే సేవల కార్మికులం. మూడో ఆర్థిక రంగాన్ని నడిపిస్తూ... మొదటి ఉత్పాదక రంగాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించని అజ్ఞానులం..

పదకేళి 1

Image
పదకేళి - 1

నా పాతనగరం - ఆ పాతమధురం

ఎవరన్నారు పాత నగరం మారలేదని ... ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు  ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు  ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి  ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి  ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో  నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి  కనిపించని ఆటస్థలం  ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం  సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి  గూగులమ్మ ప్రతి గల్లీ చూపిస్తున్నది  పెంకుటిండ్లు మిగలలేదు  రేకుల ఇళ్ళు కూలుతున్నాయి  అపార్ట్ మెంట్లు మొలుస్తున్నాయి. దూరపు కొండలు నునుపు కానీ అదేమిటో ... మా ప్రాంతం మాత్రం అందరికీ గరుకు  కాదు కాదు వారందరికీ బెరుకు. ఇక్కడ... పండుగల జషన్ లలో  పోటాపోటీ ప్రదర్శనలు  బావులు లేని బౌలీలు  తలాబ్ లేని కట్టలు  ఆటలు లేని మైదానాలు  మనుషులు తగ్గిన జనాజాలు  సాలార్జంగ్ మ్యూజియంలో చిత్ర విచిత్రం  నడిరోడ్డుపై ముసుగులు కప్పుకునే మతసామరస్యం జెండాలు పార్టీలకు అజెండాలు అవుతాయి, అప్పుడు పూచిక పుల్ల కూడా ఏనుగు అవుతుంది  దెబ్బకు మెట్రో మావద్ద ముడుచుకుంటుంది  ఇళ్ళ ముందు అరుగులు పోతున్నాయి 

దేశభక్తి

ఏ సచ్ హై యా సప్నా... మే 26, 2000. రాత్రి స్నేహితులను కలిసి నల్లకుంట నుండి ఇంటికి వెళ్తున్నా. చార్మినార్ బస్ ఎక్కి ఎంట్రెన్స్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో ఒక పక్కగా కూర్చున్నా. ప్రశాంతంగా ఉన్న నాలో .. తక్షక్ సినిమాలోని .. ఔర్ దూర్ కహీఁ రోషన్ హువా ... ఏక్ చెహెరా... అన్న పాట చరణం మాటిమాటికీ గిరికీలు కొడ్తున్నది. బస్ ఫీవర్ ఆస్పత్రి దగ్గర ఆగింది. ఇద్దరెక్కారు. తరువాత ఎక్కినవాడు ఫుట్ బోర్డు రెండో మెట్టు పైన అలాగే నిల్చున్నాడు. ఇంతలో బస్ మళ్ళీ పరుగెత్తనారంభించింది. అప్పుడే వెనకనుండి పరుగెడ్తూ ఓ నడివయసాయన ఎక్కబోయాడు. కాని ఎక్కలేక ఇతణ్ణేమో అన్నాడు. ఇతను ఏదో అన్నాడు. మొత్తం మీద ఆ పెద్దమనిషి మాత్రం ఎక్కలేకపోయాడు. ఎక్కలేకపోతే ఎందుకు ప్రయత్నించాలో.. అనుకుంటూ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. నువ్వే అడ్డముంటివి. ఎలా ఎక్కుతాడు. అన్నాడు నా పక్క సీటువాడు. ఎక్కలేక పోతే నా తప్పా.. అనుకుంటూ గొణుగుతూ ఉన్నాడతను. ... .... కొంచెం సేపయినతర్వాత నా పక్కసీటువాడు.. మన హైద్రాబాదులో ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదండీ అన్నాడు. ఇక మద్రాస్ తోనో, బాంబేతోనో పోల్చబోతున్నాడ్రా బాబూ అనుకుంటూ ఉన్నాన్నేను.