Posts

Showing posts from March, 2024

బాలల రామాయణం

1. వల్మీక మహర్షి అనగనగా ఒక అడవి. అడవిలో ఒక చిన్న పల్లె. పల్లెలో ఒక వేటగాడిఇల్లు. కుటుంబం పెద్దది అయ్యింది. దారిదోపిడి మొదలు పెట్టాడు. దోపిడి దొంగగ మారాడు. అడవి నుండి పోయేవాళ్ళను దోచేవాడు. అట్లా ఉండగా ఒకరోజు. ఏడుగురు మునులు కనిపించారు. ఉన్నది ఇమ్మని వారిని బెదిరించాడు. ఇస్తాం సరే కాని ... ప్రశ్నకు జవాబు ఇవ్వు అన్నారు. దోచింది ఏం చేస్తావు అని అడిగారు. పెళ్ళాం బిడ్డలకు  పంచుతాను అన్నాడు. మరి.. దోపిడితో వచ్చే పాపం కూడా పంచుతావా అని అడిగారు. లేదని జవాబు ఇచ్చాడు. దాన్ని పంచుకోవడం ఇష్టమా. అడిగి రమ్మన్నారు. అంతవరకు తాము ఉంటాము అన్నారు. ఇంటికి వెళ్ళి, అడిగాడు తన వారిని. తిండి పెట్టడం నీ బాధ్యత. మాకు సంబంధం లేదు అన్నారు. నిరాశగా తిరిగి వచ్చాడు. మునులను దారి చూపమన్నాడు. తపస్సు చేయమని వెళ్ళారు. దారిలో నారదుడు కనిపించాడు. మరా అని ధ్యానం చేయమన్నాడు. మరా జపం రాను రాను రామ అయింది. ఏళ్ళకు ఏళ్ళు గడిచాయి. చుట్టూ పుట్ట పెరిగింది. పుట్టను వల్మీకం అంటారు. అందుకే వాల్మీకి అన్నారు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. దివ్యదృష్టిని ప్రసాదించాడు. రామాయణం రాయమని వెళ్ళి పోయాడు. ఒకనాడు...స్నానానికి నదికి పోతున్నాడు