Posts

Showing posts from November, 2010

మహిళా సాధికారత

సాధికారత అంటే స + అధికారత అని అర్థం. అధికారంతో కూడిన అని. అది సంపాదనలోనో ఇతరత్రానో సమానహోదా అని కాకుండా నిర్ణాయక శక్తి అని అర్థం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. నేటి మహిళ నిన్నటి మహిళ కంటే ఆర్జనలో మంచి స్థితిలో ఉన్నది. అందుకు మారుతున్న ఆర్థికపరమైన వత్తిళ్ళే ముఖ్యకారణం అని చెప్పవచ్చు. చదవడంలో వచ్చిన స్వేచ్ఛ, కుటుంబ సంపాదనలో తప్పని సరైన భాగస్వామ్యం ఆర్థికంగా స్వావలంబనదిశగా మహిళను పయనమయేలా చేస్తున్నాయి. పది పదిహేనేళ్ళ క్రితం వరకు శారీరక శ్రమ అనే అంశం మహిళకు పని అవకాశాన్ని నిర్ణయించేది. పదేళ్ళ క్రితమే బస్సులలో కండక్టరుగా స్థానం పొందగలిగింది మహిళ. ఇప్పటికీ కనీసం ఆటో నడిపించటానికి శక్తి సరిపోనిదిగానే భావించబడుతోంది. అయితే కనీసం ద్విచక్రవాహనాల లైసెన్సు పొందగలిగే ఆమోదాన్ని పొందగలిగిందనే సంతోషమే కొంత ఊరట. పై అంశాన్ని గమనించినపుడు సమాన అవకాశం లభించడంలేదు అనిపిస్తుంది. లేదా సమాన అవకాశం పొందడంలో వివక్షతకు గురౌతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మహిళల ఉద్యోగితను ప్రస్తావించుకున్నపుడు ఫరవాలేదనిపిస్తుంది. ఈ అవకాశం లభించడానికి కారణం శారీరక శ్రమ అనే అంశం లేకపోవడమే అనిపిస్తుంది. అయితే

తంతువు

ఏదో హృదయతంతువు లాగి వదలబడుతున్న భావం అల్లెత్రాటిపోగులను బాణం విడుస్తున్న వేళ కోడిపిల్ల బయటకు వచ్చే తపనలో పెంకుపై ఏర్పడుతున్న నెర్రెల పోలిక సీతాకోకచిలుక తన గూడును చీల్చుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి బయలుదేరుతున్న దృశ్యం శకుంతలకు అత్తవారింటి జాగ్రత్తలు చెప్పి సాగనంపుటకు కదులుతున్న కణ్వుని అంతర్వాణి తన కొడుకుకు సుద్దులు నేర్పి పులి వద్దకు ఆహారంగా కదలబోతున్న ఆవుతల్లి ముంగాలు ఇవేవీ సరిపోలవేమో మరి పోల్చడానికి తన విద్యార్థులు వీడిపోతున్న వేళ ఉపాధ్యాయుని భావవైవర్ణాన్ని. కనుచూపునుండి దూరమవబోతున్న ఆ తరగతి గోడలను, తలుపులను, కిటికీలను. ఇన్నాళ్ళూ సహచరులుగా మసలిన తోటి పిల్లలను. ఇదంతా అర్థం అవుతుందా. వెలువడబోతున్న శబ్దతరంగానికి, దూసుకుపోబోతున్న బాణానికి. ఆ కోడిపిల్ల తపనకు సీతాకోకచిలుక రెక్కలలో ప్రోదిచేసుకున్న ఉత్సాహానికి భర్త పలకరింపు తెలియని శకుంతల మోహాతీతమైన మనసుకు. అనాథగా మిగలబోతున్న అన్నుల మిన్నకు.