Posts

బాలల రామాయణం

1. వల్మీక మహర్షి అనగనగా ఒక అడవి. అడవిలో ఒక చిన్న పల్లె. పల్లెలో ఒక వేటగాడిఇల్లు. కుటుంబం పెద్దది అయ్యింది. దారిదోపిడి మొదలు పెట్టాడు. దోపిడి దొంగగ మారాడు. అడవి నుండి పోయేవాళ్ళను దోచేవాడు. అట్లా ఉండగా ఒకరోజు. ఏడుగురు మునులు కనిపించారు. ఉన్నది ఇమ్మని వారిని బెదిరించాడు. ఇస్తాం సరే కాని ... ప్రశ్నకు జవాబు ఇవ్వు అన్నారు. దోచింది ఏం చేస్తావు అని అడిగారు. పెళ్ళాం బిడ్డలకు  పంచుతాను అన్నాడు. మరి.. దోపిడితో వచ్చే పాపం కూడా పంచుతావా అని అడిగారు. లేదని జవాబు ఇచ్చాడు. దాన్ని పంచుకోవడం ఇష్టమా. అడిగి రమ్మన్నారు. అంతవరకు తాము ఉంటాము అన్నారు. ఇంటికి వెళ్ళి, అడిగాడు తన వారిని. తిండి పెట్టడం నీ బాధ్యత. మాకు సంబంధం లేదు అన్నారు. నిరాశగా తిరిగి వచ్చాడు. మునులను దారి చూపమన్నాడు. తపస్సు చేయమని వెళ్ళారు. దారిలో నారదుడు కనిపించాడు. మరా అని ధ్యానం చేయమన్నాడు. మరా జపం రాను రాను రామ అయింది. ఏళ్ళకు ఏళ్ళు గడిచాయి. చుట్టూ పుట్ట పెరిగింది. పుట్టను వల్మీకం అంటారు. అందుకే వాల్మీకి అన్నారు. చివరికి బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడు. దివ్యదృష్టిని ప్రసాదించాడు. రామాయణం రాయమని వెళ్ళి పోయాడు. ఒకనాడు...స్నానానికి నదికి పోతున్నాడు

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)

28/12/2023 రంగులు లేని‌ లోకం ఎలా ఉంటుంది? బోసిగా, నిస్సారంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా కదూ. రంగులలో పసుపు నీలం ఎరుపు ప్రాథమిక రంగులు.  అలాగే అచ్చులు లేని హల్లులు కూడా జీవం లేనివే. అచ్చుల్లో అ ఇ ఉ ఋ లు ప్రాథమికం. ఎలాగో ముందు చూద్దాం. 29/12/2023 పసుపు నీలం తో ఆకుపచ్చని, ఎరుపు తో నారింజ రంగు, నీలం ఎరుపు తో జేగురు రంగులను ఇచ్చినట్లు; అ ఇ లను ఒకేసారి వరుసగా పలికితే ఏ, అ ఉ లను పలికితే ఓ, అ ఋ లను పలికితే అర్ ను ఇస్తాయి. *ఏ, ఓ, అర్* లను *గుణములు* అంటాము. 29/12/2023 అ + ఇ = ఏ, అ + ఉ = ఓ, అ+ ఋ = అర్ ; ఏ, ఓ అర్ లను పలుక గలిగితే 👍 పెట్టండి. 31/12/2023 ఇప్పటి వరకు అ,ఇ,ఉ,ఋ లతో పాటు ఆ,ఈ,ఊ,ౠ లకు కూడా ఇదే మెకానిజం వర్తిస్తుంది.‌ ఏ,ఓ, ఐ,ఔ అచ్చులు కూడా వచ్చేశాయి. కాని ఎ,ఒ లు ఇంకా రాలేదు. కారణం... ప్రస్తుతం మనం సంస్కృత భాషలో అచ్చుల గురించే మాట్లాడుకుంటున్నాం.  ఎ,ఒ అచ్చులు తెలుగు భాషలో (ఇతర దక్షిణ భారత దేశ భాషలలో ) మాత్రమే కనిపిస్తాయి. 31/12/2023 ఇక ఌ, ౡ లు సాధారణ సంస్కత భాషలోనూ కనిపించవు. కేవలం వేదం లోనే కనిపిస్తాయి. అ తో ఇ,ఉ,ఋ లు ఏ,ఓ, అర్ అనే గుణాలను ఏర్పరచగా అ ఌ తో కొత్త అచ్చును ఏర్పరచకపోవడం గమనించాలి.

మా 'సారు'

పాఠం చెప్పిన తర్వాత ... నాకేమొచ్చేదో తెలియదు. కానీ మా సారుకు తెలిసేది. అమ్మకు...  బిడ్డ ఆకలి తెలిసినట్టు. చదవడం రాదన్నా సారు చదువుమనేది. అదేం చిత్రమో...  తప్పులే లేకపోయేవి. ఓపిక... మా సారు పేరే పెట్టుకుంది. అది మా సారు నుండే ఓపికగా ఉండటం నేర్చుకున్నది. నామీద  నాకు అపనమ్మకం. కానీ మా సారుకు  నాకృషి మీద నమ్మకం. భవిష్యత్తులో ఏం చేయాలో  ఆలోచన లేని నాపై ... మా సారుకు ఎంతో గురి. అందుకే ... సున్నా వచ్చినా పర్లేదు,  ప్రయత్నం చేయమనేది.  కానీ ఆయన నమ్మకం... ఎప్పుడూ యాబైకి తగ్గేది కాదు. అవును... నాకంటే మా సారుకే  నేనంటే నమ్మకం.

పర్యావ'రణం'

🌻"తాను" ఏకాకి🌻 "తన"కు "తాను" అపరిచితుడు. 'తన'ను "తాను" ఎరుగడు. 'తన'లోనే "తాను" ఉన్నానని  తెలియని అద్వైతం - మాయ. 'తన' నుండి "తాను" వేరనే  ద్వైతంలోని మాయ. పంచభూత తత్త్వం ' "తానే" ' నని ఎరుగని వాడు చేసే ప్రతి క్రియా "తన"కు ప్రతిక్రియగా మారుతుందని తెలుసుకునే నాటికి, 'తన' నుండి "తన"ను బయటకు తరిమేస్తున్నదనే చైతన్యం శూన్యమై, శాశ్వతంగా ద్వైతం కిందకు  మారిపోతున్నది. మారడాన్ని వ్యతిరేకించే జడత్వం "తన" చేతనను నిర్వీర్యం చేస్తుందని తెలుసుకునే సమయానికి, 'ప్రకృతి' "మనిషి"ని తనలో కలవకుండా ఏకాకిగా వదిలివేస్తుంది. ప్రకృతి పట్ల చైతన్యమే మనిషికి 'తన్'మయత్వం.             *****

పాఠశాల మాధ్యమంలో తెలుగు విద్యార్థి.. ఉపాధ్యాయుల పరిస్థితి

ఆరోజు ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చి డైలీ పేపర్ కోసం వెయిట్ చేస్తూ, టీ సిప్ చేస్తున్నా. యాజ్ యూజువల్ గా లేట్ గా 'పేపర్' అంటూ - పడేసి వెళ్ళిపోయాడు. మెయిన్ న్యూస్ చూసి సెకండ్ పేజీ తిప్పేసరికి చాలామంది ప్రముఖుల ఫోటోలు "మాతృభాషా దినోత్సవం” సందర్భంగా కనిపించాయి.  రాత్రి ఏదో చానెల్ లో ఇదే సందర్భంగా వచ్చిన ఒక చర్చలో ఒక ప్రముఖుడు మాతృభాషలో విద్యాభ్యాసం ,చేయకపోవడం వల్లే పరిశోధనారంగంలో వెనుకబడిపోతున్నామన్నారు ఎందుకు?  విజ్ఞానశాస్త్రాలను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రష్యా, జపాన్, చైనా మొదలైన దేశాలలో - ఇంగ్లీషు రాకపోయినా వారు వెనుకబడి లేరు. అంటే అభివృద్ధికి ఇంగ్లీషుకు సంబంధం లేదు. ఆ ప్రాథమిక విద్య ఏ మాధ్యమంలో నేర్చుకుంటున్నాము అనేది నేరుగా మన అవగాహనాస్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. ప్రాథమికమైన శబ్దజాలం మొత్తం ఆ స్థాయిలోనే పరిచయం అవుతున్నది. ఇక విజ్ఞానశాస్త్రాలు ఆరవ తరగతి నుండి దేనికది వేరువేరుగా ప్రత్యేకతను పొందుతున్నాయి. అప్పటికే వాటి ప్రాథమిక పదజాలం పిల్లవాడికి అలవాటుపడాలి.  మన పాఠశాలల్లో తెలుగు మాధ్యమంగా చదువుకుంటున్న పిల్లలకు త్రిభాషా సూత్రం ప్రకార

Nature of Language

Image

టీచర్

ఈ రోజు పంద్రాగస్టు. ఉదయం బడికి పోయి జెండా ఎగరేసి వచ్చి భోజనం చేస్తున్నాం. భోజనం మధ్యలో ఫోన్. మావాడి గురించి వాళ్ళ టీచర్ ఫోన్. తను ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగా పోయిన బడిలో కాంపిటీషన్ కు పిల్లల్ని తయారు చేయడానికి నాలుగు శ్లోకాలు చదివి రికార్డు చేసి పంపమని. చర్చ వాడి‌ స్కూల్ పిల్లలు చదువుల పైకి మళ్ళింది. ట్రాన్స్ఫర్ అయిన సార్లు, పోయిన తరగతుల్లో చెప్పిన టీచర్లు ... అన్ని ఒకదానివెంట ఒకటి కబుర్లు నడుస్తూ ఉన్నాయి. నచ్చిన టీచర్ గురించి మొదలు. తనను మెచ్చుకుంటూ ... తోటి విద్యార్థులు ఆ టీచర్ ను మాత్రం నిక్ నేమ్ తో పిలవలేదు. మిగతా టీచర్లు సార్లను నిక్ నేమ్ లతో పిలిచేవారు అన్నాడు. ఆ టీచర్ పై మాత్రం అభిమానం తో ఏమీ అనేవారు కాదని అన్నాడు. కారణం అడిగితే ఆ టీచర్ అలా విద్యార్థులను చూసుకునేది అన్నాడు. ఇంతలోనే ఒకేసారి... తను మాత్రం టీచర్ కావద్దని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. పిల్లలు టీచర్స్ ను అలా అమర్యాదగా పిలుస్తారు కాబట్టి అన్నాడు. అట్లా ఎందుకు? మా చిన్నప్పుడు కూడా మా‌ టీచర్ సార్ లను అలాగే పిలిచేవారు. మరి నేను టీచర్ అవుదామనుకున్నపుడు కాని, ట్రైనింగ్ కు పోయినపుడు ఇలా అనిపించలేదు కదా అన్న