నా పాతనగరం - ఆ పాతమధురం
ఎవరన్నారు పాత నగరం మారలేదని ... ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి కనిపించని ఆటస్థలం ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి గూగులమ్మ ప్రతి గల్లీ చూపిస్తున్నది పెంకుటిండ్లు మిగలలేదు రేకుల ఇళ్ళు కూలుతున్నాయి అపార్ట్ మెంట్లు మొలుస్తున్నాయి. దూరపు కొండలు నునుపు కానీ అదేమిటో ... మా ప్రాంతం మాత్రం అందరికీ గరుకు కాదు కాదు వారందరికీ బెరుకు. ఇక్కడ... పండుగల జషన్ లలో పోటాపోటీ ప్రదర్శనలు బావులు లేని బౌలీలు తలాబ్ లేని కట్టలు ఆటలు లేని మైదానాలు మనుషులు తగ్గిన జనాజాలు సాలార్జంగ్ మ్యూజియంలో చిత్ర విచిత్రం నడిరోడ్డుపై ముసుగులు కప్పుకునే మతసామరస్యం జెండాలు పార్టీలకు అజెండాలు అవుతాయి, అప్పుడు పూచిక పుల...