28/12/2023 రంగులు లేని లోకం ఎలా ఉంటుంది? బోసిగా, నిస్సారంగా, ఏదో పోగొట్టుకున్నట్టుగా కదూ. రంగులలో పసుపు నీలం ఎరుపు ప్రాథమిక రంగులు. అలాగే అచ్చులు లేని హల్లులు కూడా జీవం లేనివే. అచ్చుల్లో అ ఇ ఉ ఋ లు ప్రాథమికం. ఎలాగో ముందు చూద్దాం. 29/12/2023 పసుపు నీలం తో ఆకుపచ్చని, ఎరుపు తో నారింజ రంగు, నీలం ఎరుపు తో జేగురు రంగులను ఇచ్చినట్లు; అ ఇ లను ఒకేసారి వరుసగా పలికితే ఏ, అ ఉ లను పలికితే ఓ, అ ఋ లను పలికితే అర్ ను ఇస్తాయి. *ఏ, ఓ, అర్* లను *గుణములు* అంటాము. 29/12/2023 అ + ఇ = ఏ, అ + ఉ = ఓ, అ+ ఋ = అర్ ; ఏ, ఓ అర్ లను పలుక గలిగితే 👍 పెట్టండి. 31/12/2023 ఇప్పటి వరకు అ,ఇ,ఉ,ఋ లతో పాటు ఆ,ఈ,ఊ,ౠ లకు కూడా ఇదే మెకానిజం వర్తిస్తుంది. ఏ,ఓ, ఐ,ఔ అచ్చులు కూడా వచ్చేశాయి. కాని ఎ,ఒ లు ఇంకా రాలేదు. కారణం... ప్రస్తుతం మనం సంస్కృత భాషలో అచ్చుల గురించే మాట్లాడుకుంటున్నాం. ఎ,ఒ అచ్చులు తెలుగు భాషలో (ఇతర దక్షిణ భారత దేశ భాషలలో ) మాత్రమే కనిపిస్తాయి. 31/12/2023 ఇక ఌ, ౡ లు సాధారణ సంస్కత భాషలోనూ కనిపించవు. కేవలం వేదం లోనే కనిపిస్తాయి. అ తో ఇ,ఉ,ఋ లు ఏ,ఓ, అర్ అనే గుణాలను ఏర్పరచగా అ ఌ తో కొత్త అచ్చును ఏర్పరచకపోవడం గమ...
Comments
దాన్ని బట్టి ఈ ప్రశ్లకు సమాధానం ఉంటుంది.
ఒక చిన్న చిట్కా
1. లేఖిని ఓపెన్ చేసి, File --> save as --> కొట్టి ఇంట్లో కంప్యూటర్లో కాపీ చేసుకోండి. తరవాత లేఖినిలో టైపు చేసినవి నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకోని నెట్టుకు తెచ్చుకోవచ్చు.
మీ ఈ ప్రవాశం శత పుటలా అనునిత్యం వర్దిల్లాలని మా ఆకాంక్ష.
మరొక చిన్న విన్నపం, పద నిర్దారణ తొలగించ గలరు.
ఇట్లు,
భవదీయుడు