మహాదాత

నాలుగు మెతుకులు తిని

ఆరుగాలాలు శ్రమించి

వేలమంది ఆకలి తీర్చే

ఓ రైతన్నా నిజం నిజం

ముమ్మాటికీ నువ్వు

అన్నదాతవే!

మాకోసం నీ వద్ద లేని

భూమిని నీటిని 

ఎరువును విత్తనాన్ని

ఒక్కటి చేసి

మెతుకు గా మార్చి

బతుకు మాకిస్తున్నావు.

నీకంటూ ఏమీ మిగలనీయని

మా మానవతను

ఏవగించుకో...

శపించకు

నాగరికత ముసుగులో

శలభాలం

నీ కడుపు మంటకు

మాడిపోతాం.

ఆకలిమంటలకు

మసయిపోతాం.

కానీ...

నీవు దాతవు

నీకంటూ దాచుకోవు.

మేము మాత్రం ఏం చేస్తాం!

ప్రపంచీకరణ ఊబిలో

కూరుకు పోతున్న

వినియోగదారులం.

దారీతెన్నూ లేని

బాటసారులం.

కంటనీరు ఉబుకని

రాతిగుండెలం.

జీ హుజూరనే

సేవల కార్మికులం.

మూడో ఆర్థిక రంగాన్ని

నడిపిస్తూ...

మొదటి ఉత్పాదక రంగాన్ని

ఎలా కాపాడుకోవాలో

ఆలోచించని

అజ్ఞానులం..

Comments

Sharmajee! Halam,beejam,jalam latho mana jeevam nu kaapadithunna raithunu keerthinchinanduku meeku namovaakamulu.

Popular posts from this blog

టీచర్

మా 'సారు'

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)