మా 'సారు'

పాఠం చెప్పిన తర్వాత ...
నాకేమొచ్చేదో తెలియదు.
కానీ మా సారుకు తెలిసేది.
అమ్మకు... 
బిడ్డ ఆకలి తెలిసినట్టు.
చదవడం రాదన్నా సారు చదువుమనేది.
అదేం చిత్రమో... 
తప్పులే లేకపోయేవి.

ఓపిక... మా సారు పేరే పెట్టుకుంది.
అది మా సారు నుండే ఓపికగా ఉండటం నేర్చుకున్నది.

నామీద 
నాకు అపనమ్మకం.
కానీ మా సారుకు 
నాకృషి మీద నమ్మకం.

భవిష్యత్తులో ఏం చేయాలో 
ఆలోచన లేని నాపై ...
మా సారుకు ఎంతో గురి.
అందుకే ...
సున్నా వచ్చినా పర్లేదు, 
ప్రయత్నం చేయమనేది. 
కానీ ఆయన నమ్మకం... ఎప్పుడూ యాబైకి తగ్గేది కాదు.

అవును...
నాకంటే మా సారుకే 
నేనంటే నమ్మకం.

Comments

Seetha said…
బాగుంది, బాగుంది, నిజమే.

Popular posts from this blog

టీచర్

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)