టీచర్

రోజు పంద్రాగస్టు.
ఉదయం బడికి పోయి జెండా ఎగరేసి వచ్చి భోజనం చేస్తున్నాం.

భోజనం మధ్యలో ఫోన్. మావాడి గురించి వాళ్ళ టీచర్ ఫోన్. తను ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగా పోయిన బడిలో కాంపిటీషన్ కు పిల్లల్ని తయారు చేయడానికి నాలుగు శ్లోకాలు చదివి రికార్డు చేసి పంపమని.

చర్చ వాడి‌ స్కూల్ పిల్లలు చదువుల పైకి మళ్ళింది. ట్రాన్స్ఫర్ అయిన సార్లు, పోయిన తరగతుల్లో చెప్పిన టీచర్లు ... అన్ని ఒకదానివెంట ఒకటి కబుర్లు నడుస్తూ ఉన్నాయి.

నచ్చిన టీచర్ గురించి మొదలు. తనను మెచ్చుకుంటూ ... తోటి విద్యార్థులు ఆ టీచర్ ను మాత్రం నిక్ నేమ్ తో పిలవలేదు. మిగతా టీచర్లు సార్లను నిక్ నేమ్ లతో పిలిచేవారు అన్నాడు. ఆ టీచర్ పై మాత్రం అభిమానం తో ఏమీ అనేవారు కాదని అన్నాడు. కారణం అడిగితే ఆ టీచర్ అలా విద్యార్థులను చూసుకునేది అన్నాడు.

ఇంతలోనే ఒకేసారి... తను మాత్రం టీచర్ కావద్దని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. పిల్లలు టీచర్స్ ను అలా అమర్యాదగా పిలుస్తారు కాబట్టి అన్నాడు.

అట్లా ఎందుకు? మా చిన్నప్పుడు కూడా మా‌ టీచర్ సార్ లను అలాగే పిలిచేవారు. మరి నేను టీచర్ అవుదామనుకున్నపుడు కాని, ట్రైనింగ్ కు పోయినపుడు ఇలా అనిపించలేదు కదా అన్నాను.

దానికి వాడు చెప్పిన మాట ...
మా ఫ్రెండ్స్ అంటున్న సమయంలో నేను టీచర్ ప్లేస్ లో ఉండి ఫీల్ అయ్యాను నాన్నా అని.

నా నోట మాట పెగల్లేదు. మావాడి మీద నాకొక్కసారిగా అభిమానం ఆకాశమంత ఎత్తుకు పొంగిపోయింది.

కానీ అంతలోనే మధురానుభూతిని చిందరవందర చేస్తూ నా విద్యార్థులు నన్నేమంటున్నారో అన్న ఆలోచనల తుఫాన్ చుట్టుముట్టింది.

Comments

Anonymous said…
youtube: YouTube - HD video, videos, sound effects, sound
youtube: YouTube - HD video, videos, sound effects, sound effects, sound effects, sound effects, sound effects, sound effects, sound effects, best youtube to mp3 sound effects, sound effects, sound effects,
Seetha said…
చాలా బాగుంది..అవును,సమాజంలో,ఇంట్లో బాడీషేమింగ్/ప్రవర్తన గురించో నిక్ నేమ్ లు విని అలా పెట్టడం అలవాటు చేసుకుంటుంటారు.

హైస్కూల్,కాలేజీల్లో ఇంకా ఎక్కువే...

ఒక్కో సారి మంచి టీచర్ అయి పిల్లలను ఎంత బాగా చూసుకున్న స్ట్రిక్ట్ గా ఉండాల్సి వస్తే ఇలాంటివి తప్పవేమో..
ముఖ్యంగా మాస్ కాపీయింగ్ యథేచ్ఛగా జరుగుతున్న ఈ కాలంలో...

Popular posts from this blog

బాలల రామాయణం

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)