దేశభక్తి
ఏ సచ్ హై యా సప్నా... మే 26, 2000. రాత్రి స్నేహితులను కలిసి నల్లకుంట నుండి ఇంటికి వెళ్తున్నా. చార్మినార్ బస్ ఎక్కి ఎంట్రెన్స్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో ఒక పక్కగా కూర్చున్నా. ప్రశాంతంగా ఉన్న నాలో .. తక్షక్ సినిమాలోని .. ఔర్ దూర్ కహీఁ రోషన్ హువా ... ఏక్ చెహెరా... అన్న పాట చరణం మాటిమాటికీ గిరికీలు కొడ్తున్నది. బస్ ఫీవర్ ఆస్పత్రి దగ్గర ఆగింది. ఇద్దరెక్కారు. తరువాత ఎక్కినవాడు ఫుట్ బోర్డు రెండో మెట్టు పైన అలాగే నిల్చున్నాడు. ఇంతలో బస్ మళ్ళీ పరుగెత్తనారంభించింది. అప్పుడే వెనకనుండి పరుగెడ్తూ ఓ నడివయసాయన ఎక్కబోయాడు. కాని ఎక్కలేక ఇతణ్ణేమో అన్నాడు. ఇతను ఏదో అన్నాడు. మొత్తం మీద ఆ పెద్దమనిషి మాత్రం ఎక్కలేకపోయాడు. ఎక్కలేకపోతే ఎందుకు ప్రయత్నించాలో.. అనుకుంటూ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. నువ్వే అడ్డముంటివి. ఎలా ఎక్కుతాడు. అన్నాడు నా పక్క సీటువాడు. ఎక్కలేక పోతే నా తప్పా.. అనుకుంటూ గొణుగుతూ ఉన్నాడతను. ... .... కొంచెం సేపయినతర్వాత నా పక్కసీటువాడు.. మన హైద్రాబాదులో ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదండీ అన్నాడు. ఇక మద్రాస్ తోనో, బాంబేతోనో పోల్చబోతున్నాడ్రా బాబూ అనుకుంటూ ఉన్నాన్నేను. ...