పర్యావ'రణం'

🌻"తాను" ఏకాకి🌻

"తన"కు "తాను" అపరిచితుడు.
'తన'ను "తాను" ఎరుగడు.
'తన'లోనే "తాను" ఉన్నానని 
తెలియని అద్వైతం - మాయ.
'తన' నుండి "తాను" వేరనే 
ద్వైతంలోని మాయ.

పంచభూత తత్త్వం
' "తానే" ' నని ఎరుగని వాడు
చేసే ప్రతి క్రియా "తన"కు ప్రతిక్రియగా
మారుతుందని తెలుసుకునే నాటికి,
'తన' నుండి "తన"ను బయటకు తరిమేస్తున్నదనే చైతన్యం శూన్యమై,
శాశ్వతంగా ద్వైతం కిందకు 
మారిపోతున్నది.

మారడాన్ని వ్యతిరేకించే జడత్వం
"తన" చేతనను నిర్వీర్యం చేస్తుందని
తెలుసుకునే సమయానికి,
'ప్రకృతి' "మనిషి"ని తనలో కలవకుండా ఏకాకిగా వదిలివేస్తుంది.
ప్రకృతి పట్ల చైతన్యమే
మనిషికి 'తన్'మయత్వం.
            *****

Comments

Popular posts from this blog

టీచర్

బాలల రామాయణం

అక్షరాల మురమురాలు (వాట్సాప్ స్టేటస్ సీరియల్ వ్యాసం)