Posts

పాఠశాల మాధ్యమంలో తెలుగు విద్యార్థి.. ఉపాధ్యాయుల పరిస్థితి

ఆరోజు ఎర్లీ మార్నింగ్ మెలకువ వచ్చి డైలీ పేపర్ కోసం వెయిట్ చేస్తూ, టీ సిప్ చేస్తున్నా. యాజ్ యూజువల్ గా లేట్ గా 'పేపర్' అంటూ - పడేసి వెళ్ళిపోయాడు. మెయిన్ న్యూస్ చూసి సెకండ్ పేజీ తిప్పేసరికి చాలామంది ప్రముఖుల ఫోటోలు "మాతృభాషా దినోత్సవం” సందర్భంగా కనిపించాయి.  రాత్రి ఏదో చానెల్ లో ఇదే సందర్భంగా వచ్చిన ఒక చర్చలో ఒక ప్రముఖుడు మాతృభాషలో విద్యాభ్యాసం ,చేయకపోవడం వల్లే పరిశోధనారంగంలో వెనుకబడిపోతున్నామన్నారు ఎందుకు?  విజ్ఞానశాస్త్రాలను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడుతుంది. రష్యా, జపాన్, చైనా మొదలైన దేశాలలో - ఇంగ్లీషు రాకపోయినా వారు వెనుకబడి లేరు. అంటే అభివృద్ధికి ఇంగ్లీషుకు సంబంధం లేదు. ఆ ప్రాథమిక విద్య ఏ మాధ్యమంలో నేర్చుకుంటున్నాము అనేది నేరుగా మన అవగాహనాస్థాయిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నది. ప్రాథమికమైన శబ్దజాలం మొత్తం ఆ స్థాయిలోనే పరిచయం అవుతున్నది. ఇక విజ్ఞానశాస్త్రాలు ఆరవ తరగతి నుండి దేనికది వేరువేరుగా ప్రత్యేకతను పొందుతున్నాయి. అప్పటికే వాటి ప్రాథమిక పదజాలం పిల్లవాడికి అలవాటుపడాలి.  మన పాఠశాలల్లో తెలుగు మాధ్యమంగా చదువుకుంటున్న పిల్లలకు త్రిభాషా సూత్రం ప్రకా...

Nature of Language

Image

టీచర్

ఈ రోజు పంద్రాగస్టు. ఉదయం బడికి పోయి జెండా ఎగరేసి వచ్చి భోజనం చేస్తున్నాం. భోజనం మధ్యలో ఫోన్. మావాడి గురించి వాళ్ళ టీచర్ ఫోన్. తను ట్రాన్స్ఫర్ అయింది. కొత్తగా పోయిన బడిలో కాంపిటీషన్ కు పిల్లల్ని తయారు చేయడానికి నాలుగు శ్లోకాలు చదివి రికార్డు చేసి పంపమని. చర్చ వాడి‌ స్కూల్ పిల్లలు చదువుల పైకి మళ్ళింది. ట్రాన్స్ఫర్ అయిన సార్లు, పోయిన తరగతుల్లో చెప్పిన టీచర్లు ... అన్ని ఒకదానివెంట ఒకటి కబుర్లు నడుస్తూ ఉన్నాయి. నచ్చిన టీచర్ గురించి మొదలు. తనను మెచ్చుకుంటూ ... తోటి విద్యార్థులు ఆ టీచర్ ను మాత్రం నిక్ నేమ్ తో పిలవలేదు. మిగతా టీచర్లు సార్లను నిక్ నేమ్ లతో పిలిచేవారు అన్నాడు. ఆ టీచర్ పై మాత్రం అభిమానం తో ఏమీ అనేవారు కాదని అన్నాడు. కారణం అడిగితే ఆ టీచర్ అలా విద్యార్థులను చూసుకునేది అన్నాడు. ఇంతలోనే ఒకేసారి... తను మాత్రం టీచర్ కావద్దని అనుకుంటున్నాను అన్నాడు. ఎందుకు అన్నాను. పిల్లలు టీచర్స్ ను అలా అమర్యాదగా పిలుస్తారు కాబట్టి అన్నాడు. అట్లా ఎందుకు? మా చిన్నప్పుడు కూడా మా‌ టీచర్ సార్ లను అలాగే పిలిచేవారు. మరి నేను టీచర్ అవుదామనుకున్నపుడు కాని, ట్రైనింగ్ కు పోయినపుడు ఇలా అనిపించలేదు కదా అన్న...

మురికిని దూరం తరమండి.

మురికిని దూరం తరమండి. మురికిని దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి.   మురికితో పాటు దోమలు ఉంటే, దోమలు కుడితే,  జ్వరమే వస్తే, ఇంట్లో వాళ్ళకు జబ్బులు వస్తే, ఇక మందుల ఖర్చులు బోల...

మహాదాత

నాలుగు మెతుకులు తిని ఆరుగాలాలు శ్రమించి వేలమంది ఆకలి తీర్చే ఓ రైతన్నా నిజం నిజం ముమ్మాటికీ నువ్వు అన్నదాతవే! మాకోసం నీ వద్ద లేని భూమిని నీటిని  ఎరువును విత్తనాన్ని ఒక్కటి చేసి మెతుకు గా మార్చి బతుకు మాకిస్తున్నావు. నీకంటూ ఏమీ మిగలనీయని మా మానవతను ఏవగించుకో... శపించకు నాగరికత ముసుగులో శలభాలం నీ కడుపు మంటకు మాడిపోతాం. ఆకలిమంటలకు మసయిపోతాం. కానీ... నీవు దాతవు నీకంటూ దాచుకోవు. మేము మాత్రం ఏం చేస్తాం! ప్రపంచీకరణ ఊబిలో కూరుకు పోతున్న వినియోగదారులం. దారీతెన్నూ లేని బాటసారులం. కంటనీరు ఉబుకని రాతిగుండెలం. జీ హుజూరనే సేవల కార్మికులం. మూడో ఆర్థిక రంగాన్ని నడిపిస్తూ... మొదటి ఉత్పాదక రంగాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించని అజ్ఞానులం..

పదకేళి 1

Image
పదకేళి - 1

నా పాతనగరం - ఆ పాతమధురం

ఎవరన్నారు పాత నగరం మారలేదని ... ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు  ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు  ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి  ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి  ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో  నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి  కనిపించని ఆటస్థలం  ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం  సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి  గూగులమ్మ ప్రతి గల్లీ చూపిస్తున్నది  పెంకుటిండ్లు మిగలలేదు  రేకుల ఇళ్ళు కూలుతున్నాయి  అపార్ట్ మెంట్లు మొలుస్తున్నాయి. దూరపు కొండలు నునుపు కానీ అదేమిటో ... మా ప్రాంతం మాత్రం అందరికీ గరుకు  కాదు కాదు వారందరికీ బెరుకు. ఇక్కడ... పండుగల జషన్ లలో  పోటాపోటీ ప్రదర్శనలు  బావులు లేని బౌలీలు  తలాబ్ లేని కట్టలు  ఆటలు లేని మైదానాలు  మనుషులు తగ్గిన జనాజాలు  సాలార్జంగ్ మ్యూజియంలో చిత్ర విచిత్రం  నడిరోడ్డుపై ముసుగులు కప్పుకునే మతసామరస్యం జెండాలు పార్టీలకు అజెండాలు అవుతాయి, అప్పుడు పూచిక పుల...