Posts

మురికిని దూరం తరమండి.

మురికిని దూరం తరమండి. మురికిని దూరం తరమండి. ఆరోగ్యంగా ఉండండి.   మురికితో పాటు దోమలు ఉంటే, దోమలు కుడితే,  జ్వరమే వస్తే, ఇంట్లో వాళ్ళకు జబ్బులు వస్తే, ఇక మందుల ఖర్చులు బోల...

మహాదాత

నాలుగు మెతుకులు తిని ఆరుగాలాలు శ్రమించి వేలమంది ఆకలి తీర్చే ఓ రైతన్నా నిజం నిజం ముమ్మాటికీ నువ్వు అన్నదాతవే! మాకోసం నీ వద్ద లేని భూమిని నీటిని  ఎరువును విత్తనాన్ని ఒక్కటి చేసి మెతుకు గా మార్చి బతుకు మాకిస్తున్నావు. నీకంటూ ఏమీ మిగలనీయని మా మానవతను ఏవగించుకో... శపించకు నాగరికత ముసుగులో శలభాలం నీ కడుపు మంటకు మాడిపోతాం. ఆకలిమంటలకు మసయిపోతాం. కానీ... నీవు దాతవు నీకంటూ దాచుకోవు. మేము మాత్రం ఏం చేస్తాం! ప్రపంచీకరణ ఊబిలో కూరుకు పోతున్న వినియోగదారులం. దారీతెన్నూ లేని బాటసారులం. కంటనీరు ఉబుకని రాతిగుండెలం. జీ హుజూరనే సేవల కార్మికులం. మూడో ఆర్థిక రంగాన్ని నడిపిస్తూ... మొదటి ఉత్పాదక రంగాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించని అజ్ఞానులం..

పదకేళి 1

Image
పదకేళి - 1

నా పాతనగరం - ఆ పాతమధురం

ఎవరన్నారు పాత నగరం మారలేదని ... ఒకప్పుడు కేవలం ఇరానీ చాయ్ లు బన్నులు  ఇప్పుడు బన్ను బదులు ఇడ్లీ వడలు  ముందు ఎంత దూరం పోయినా సమోసాలే గతి  ఇప్పుడు గల్లీ గల్లీలో టిఫిన్ సెంటర్లకు వసతి  ఒకప్పుడు కప్పలు చేరిన చెరువుల్లో  నేడు వినిపిస్తున్న వేలవేల మనుషుల అలజడి  కనిపించని ఆటస్థలం  ఎక్కడపడితే అక్కడ పార్కింగ్ స్థలం  సందుల్లోకి క్యాబులు దూసుకొస్తున్నాయి  గూగులమ్మ ప్రతి గల్లీ చూపిస్తున్నది  పెంకుటిండ్లు మిగలలేదు  రేకుల ఇళ్ళు కూలుతున్నాయి  అపార్ట్ మెంట్లు మొలుస్తున్నాయి. దూరపు కొండలు నునుపు కానీ అదేమిటో ... మా ప్రాంతం మాత్రం అందరికీ గరుకు  కాదు కాదు వారందరికీ బెరుకు. ఇక్కడ... పండుగల జషన్ లలో  పోటాపోటీ ప్రదర్శనలు  బావులు లేని బౌలీలు  తలాబ్ లేని కట్టలు  ఆటలు లేని మైదానాలు  మనుషులు తగ్గిన జనాజాలు  సాలార్జంగ్ మ్యూజియంలో చిత్ర విచిత్రం  నడిరోడ్డుపై ముసుగులు కప్పుకునే మతసామరస్యం జెండాలు పార్టీలకు అజెండాలు అవుతాయి, అప్పుడు పూచిక పుల...

దేశభక్తి

ఏ సచ్ హై యా సప్నా... మే 26, 2000. రాత్రి స్నేహితులను కలిసి నల్లకుంట నుండి ఇంటికి వెళ్తున్నా. చార్మినార్ బస్ ఎక్కి ఎంట్రెన్స్ పక్కనే ఖాళీగా ఉన్న సీట్లో ఒక పక్కగా కూర్చున్నా. ప్రశాంతంగా ఉన్న నాలో .. తక్షక్ సినిమాలోని .. ఔర్ దూర్ కహీఁ రోషన్ హువా ... ఏక్ చెహెరా... అన్న పాట చరణం మాటిమాటికీ గిరికీలు కొడ్తున్నది. బస్ ఫీవర్ ఆస్పత్రి దగ్గర ఆగింది. ఇద్దరెక్కారు. తరువాత ఎక్కినవాడు ఫుట్ బోర్డు రెండో మెట్టు పైన అలాగే నిల్చున్నాడు. ఇంతలో బస్ మళ్ళీ పరుగెత్తనారంభించింది. అప్పుడే వెనకనుండి పరుగెడ్తూ ఓ నడివయసాయన ఎక్కబోయాడు. కాని ఎక్కలేక ఇతణ్ణేమో అన్నాడు. ఇతను ఏదో అన్నాడు. మొత్తం మీద ఆ పెద్దమనిషి మాత్రం ఎక్కలేకపోయాడు. ఎక్కలేకపోతే ఎందుకు ప్రయత్నించాలో.. అనుకుంటూ ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. నువ్వే అడ్డముంటివి. ఎలా ఎక్కుతాడు. అన్నాడు నా పక్క సీటువాడు. ఎక్కలేక పోతే నా తప్పా.. అనుకుంటూ గొణుగుతూ ఉన్నాడతను. ... .... కొంచెం సేపయినతర్వాత నా పక్కసీటువాడు.. మన హైద్రాబాదులో ఒక్కడికీ ట్రాఫిక్ సెన్స్ లేదండీ అన్నాడు. ఇక మద్రాస్ తోనో, బాంబేతోనో పోల్చబోతున్నాడ్రా బాబూ అనుకుంటూ ఉన్నాన్నేను. ...

మహిళా సాధికారత

సాధికారత అంటే స + అధికారత అని అర్థం. అధికారంతో కూడిన అని. అది సంపాదనలోనో ఇతరత్రానో సమానహోదా అని కాకుండా నిర్ణాయక శక్తి అని అర్థం చేసుకుంటేనే సముచితంగా ఉంటుంది. నేటి మహిళ నిన్నటి మహిళ కంటే ఆర్జనలో మంచి స్థితిలో ఉన్నది. అందుకు మారుతున్న ఆర్థికపరమైన వత్తిళ్ళే ముఖ్యకారణం అని చెప్పవచ్చు. చదవడంలో వచ్చిన స్వేచ్ఛ, కుటుంబ సంపాదనలో తప్పని సరైన భాగస్వామ్యం ఆర్థికంగా స్వావలంబనదిశగా మహిళను పయనమయేలా చేస్తున్నాయి. పది పదిహేనేళ్ళ క్రితం వరకు శారీరక శ్రమ అనే అంశం మహిళకు పని అవకాశాన్ని నిర్ణయించేది. పదేళ్ళ క్రితమే బస్సులలో కండక్టరుగా స్థానం పొందగలిగింది మహిళ. ఇప్పటికీ కనీసం ఆటో నడిపించటానికి శక్తి సరిపోనిదిగానే భావించబడుతోంది. అయితే కనీసం ద్విచక్రవాహనాల లైసెన్సు పొందగలిగే ఆమోదాన్ని పొందగలిగిందనే సంతోషమే కొంత ఊరట. పై అంశాన్ని గమనించినపుడు సమాన అవకాశం లభించడంలేదు అనిపిస్తుంది. లేదా సమాన అవకాశం పొందడంలో వివక్షతకు గురౌతున్నట్టుగా అనిపిస్తోంది. అయితే సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో మహిళల ఉద్యోగితను ప్రస్తావించుకున్నపుడు ఫరవాలేదనిపిస్తుంది. ఈ అవకాశం లభించడానికి కారణం శారీరక శ్రమ అనే అంశం లేకపోవడమే అనిపిస్తుంది. అయితే...

తంతువు

ఏదో హృదయతంతువు లాగి వదలబడుతున్న భావం అల్లెత్రాటిపోగులను బాణం విడుస్తున్న వేళ కోడిపిల్ల బయటకు వచ్చే తపనలో పెంకుపై ఏర్పడుతున్న నెర్రెల పోలిక సీతాకోకచిలుక తన గూడును చీల్చుకుని స్వేచ్ఛా ప్రపంచంలోకి బయలుదేరుతున్న దృశ్యం శకుంతలకు అత్తవారింటి జాగ్రత్తలు చెప్పి సాగనంపుటకు కదులుతున్న కణ్వుని అంతర్వాణి తన కొడుకుకు సుద్దులు నేర్పి పులి వద్దకు ఆహారంగా కదలబోతున్న ఆవుతల్లి ముంగాలు ఇవేవీ సరిపోలవేమో మరి పోల్చడానికి తన విద్యార్థులు వీడిపోతున్న వేళ ఉపాధ్యాయుని భావవైవర్ణాన్ని. కనుచూపునుండి దూరమవబోతున్న ఆ తరగతి గోడలను, తలుపులను, కిటికీలను. ఇన్నాళ్ళూ సహచరులుగా మసలిన తోటి పిల్లలను. ఇదంతా అర్థం అవుతుందా. వెలువడబోతున్న శబ్దతరంగానికి, దూసుకుపోబోతున్న బాణానికి. ఆ కోడిపిల్ల తపనకు సీతాకోకచిలుక రెక్కలలో ప్రోదిచేసుకున్న ఉత్సాహానికి భర్త పలకరింపు తెలియని శకుంతల మోహాతీతమైన మనసుకు. అనాథగా మిగలబోతున్న అన్నుల మిన్నకు.